మహారాష్ట్రలో సోమవారం ( డిసెంబర్ 23) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణెలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తులపై ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ఒక వ్యక్తి మరణించాడు. మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే,...
పుణెలోని వాఘోలి రోడ్డు పక్కన కూలీలు నిద్రిస్తున్నారు. ఈ సమయంలో అటువైపు వేగంగా వచ్చిన ట్రక్ అర్దరాత్రి ( డిసెంబర్ 22 రాత్రి.. తెల్లవారితే సోమవారం 23) 12.30 గంటల సమయంలో వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులను వైభవి పవార్ (1), వైభవ్ పవార్ (2), విశాల్ పవార్ (22)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఆరుగురిని చికిత్స కోసం సాసూన్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.

VIDEO | Maharashtra: At least three persons killed, and several others injured as a dumper runs over people sleeping on footpath in Pune. Visuals from the spot.#PuneNews #PuneAccident

(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/DDCQ4FX5HM
— Press Trust of India (@PTI_News) December 23, 2024